Monday, December 23, 2024

రంజీల్లోకి షమీ తమ్ముడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ రంజీల్లోకి అడుగుపెట్టాడు. కైఫ్ బెంగాల్ తరుపున రంజీ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఆంధ్ర, బెంగాల్ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కైఫ్ 12 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దీంతో తమ్ముడికి షమీ సామాజిక మాద్యమాల్లో అభినందనలు తెలిపారు. సుదీర్ఘ పోరాటం అనంతరం అనుకున్నది సాధించావని తమ్ముడిని షమీ ప్రశంసించారు. బెంగల్ తరపున రంజీల్లో ఆడటం గొప్ప అని, ఈ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. క్రికెట్ కెరీర్‌లో ఎత్తుకు ఎదగాలని కోరుకున్నాడు. జట్టు కోసం ప్రతి మ్యాచ్‌లోనూ వంద శాతం కష్టపడాలని షమీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News