Monday, December 23, 2024

జార్ఖండ్ సీఎం కు ఏడోసారి ఈడీ నోటీస్‌లు… సిఎం సోదరి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఏడోసారి నోటీస్‌లు పంపడంపై ఆయన సోదరిఅంజలి సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ఎస్టీ అయినందునే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఈ విషయమై భువనేశ్వర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసి ట్రైబల్‌ను బాగు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు మాట్లాడుతూనే మరోవైపు ట్రైబల్స్ అయిన మమ్మల్ని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

నా సోదరుని ప్రభుత్వం ట్రైబల్ ప్రభుత్వం. జార్ఖండ్‌లో ఈ ప్రభుత్వం కొనసాగితే ట్రైబల్ ఓట్లు తమకు రావని బీజేపీ భయపడుతోందని అందుకే తన సోదరుడికి చెడ్డపేరు వచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మీ సోదరుడికి ఈడీ సమన్లు ఎందుకు పంపిందో తెలుసా అని మీడియా అడగ్గా ఆ విషయం తనకు తెలియదని ఆమె చెప్పారు. ఒకవేళ ఈడీ హేమంత్ సోరేన్‌ను అరెస్ట్ చేస్తే సోరేన్ భార్య సీఎం అవుతారా అని ప్రశ్నించగా, అది పార్టీ ఎమ్‌ఎల్‌ఎలు నిర్ణయిస్తారని సమాధానం ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఈడీ సోరేన్‌కు ఇప్పటికే ఈడీ ఆరుసార్లు సమన్లు పంపగా, ఆయన ఇంతవరకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఆయనకు ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. “ఇది మీకు చివరి అవకాశం. మీ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలి. ప్లేస్, టైమ్ మీరే చెప్పండి. మీరు రాకపోవడం వల్ల విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ” అని నోటీస్‌ల్లో ఈడీ సోరేన్‌కు తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News