Saturday, December 21, 2024

వసతిగృహం నుంచి అదృశ్యమైన బాలికలంతా క్షేమం : సిఎం మోహన్ యాదవ్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 20 కిమీ దూరంలోని పర్వాలియా ప్రాంతంలో గల అంచల్ బాలికల వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలంతా క్షేమంగా ఉన్నారని ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ వెల్లడించారు. కనిపించకుండా పోయిన వీరందర్నీ గుర్తించామని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ వసతి గృహంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాలికలు అదృశ్యం కావడానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను సస్పెండ్ చేయగా, వారికి నోటీస్‌లు జారీ చేశారు. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో ఈ వసతి గృహాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేయగా బాలికలు 26 మంది అదృశ్యమైనట్టు బయటపడింది. ఈ సంఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News