Monday, December 23, 2024

షాపింగ్‌లో కొత్త అనుభూతి: రాశి ఖన్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో షాపింగ్‌కు ఒక కొత్త అనుభూతిని మాంగళ్య షాపింగ్ మాల్ తీసుకువచ్చింది అని ప్రముఖ సినీ నటి రాశి ఖన్నా అన్నారు. హైదరాబాద్ లోని హస్తినాపురంలో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ వివాహది వేడుకలకు అన్ని శుభకార్యక్రమాలకు మాంగళ్య షాపింగ్ మాల్ అనుకూలమైంది అని అన్నారు . తాను, తన బంధుమిత్రులుకూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నామన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ కాసం నమశ్శివాయ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు సరసమైనా ధరలకు అందింస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలలో కలిపి ఇది 18వ స్టోర్ అని తెలిపారు.

బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్ తన డివిజన్ లో ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు ఇక ఎటు వెళ్లాల్సిన అవసరం లేకుండా హ్యాపీ గా షాపింగ్ చేయవచ్చని అన్నారు. కార్యక్రమం లో ఎంఎల్‌ఎ సతీమణి తేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం లో డైరెక్టర్‌లు కాసం మల్లికార్జున్, కాసం నమశ్శివాయ, కాసం కేదారి, కాసం శివ ప్రసాద్, పుల్లూరు అరుణ్, కాసం ప్రణీత్, తోనుపూనూరి కార్తీక్ అరుణ్, పుల్లూరు వరుణ్, విశాల్ పాల్గొన్నారు ముందుగా రాశి ఖన్నాను చూడటానికి వందలాది మంది అభిమానులు ఉదయం నుంచే బారులు తీరడంతో హస్తినాపురం అంతా పండుగ వాతావరణం నెలకొంది. రాశి ఖన్నా అభిమానులతో సెల్ఫీలు దిగి షాపింగ్ మాల్ అంతా తిరిగి సందడి చేసారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News