Saturday, December 21, 2024

బెంగాల్‌లో టిఎంసి నేత చౌదరి హత్య

- Advertisement -
- Advertisement -

కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హత్య జరిగింది. టిఎంసి నేత సత్యన్ చౌదరిని ఆదివారం గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి చంపివేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని బహారాంపూర్‌లో జరిగిందని అధికారులు తెలిపారు. టిఎంసి ముర్షిదాబాద్ ప్రాంత ప్రధాన కార్యదర్శి అయిన చౌదరిపై దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్చారు. దుండగులు బైక్‌లపై వచ్చారని ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు పొయ్యాయని టిఎంసి వర్గాలు తెలిపాయి. చౌదరి రాష్ట్రంలోని పిసిసి అధ్యక్షులు , కాంగ్రెస్ నేత అధీర్ రంజన్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే కాంగ్రెస్‌ను వీడి టిఎంసిలో చేరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఎక్కువ సంఖ్యలోనే ఈ నేతను చాలా సేపటి నుంచి గమనిస్తూ అదును చూసుకుని కాల్పులకు దిగారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News