Saturday, November 23, 2024

మాల్దీవుల పర్యటనను విరమించుకున్న సెలబ్రిటీలు

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత ప్రధానిని, దేశాన్ని కించపర్చడం పట్ల మాల్దీవులపై పలువురు సెలబ్రిటీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ దీవి దేశానికి తమ విడిది పర్యాటక ఏర్పాట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సంబంధిత నిర్ణయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. దీనితో మాలే ఇతర ప్రాంతాలలో భారతీయ సెలబ్రిటీలు చేసుకున్న హోటల్ ఇతరత్రా బుకింగ్‌లు రద్దు అయ్యాయి. ఇప్పుడు తాము బాయ్‌కాట్ మాల్దీవ్స్‌కు దిగుతున్నట్లు కొందరు సినీ ప్రముఖులు ప్రకటించారు. విద్వేషాన్ని మేమెందుకు సహించాలని భారతీయ ప్రముఖులు స్పందించారు. ఇక ప్రధాని చెప్పినట్లు దేశ దీవులు ఇతర పర్యాటక కేంద్రాల్లో పర్యాటకానికి అందరిని ప్రోత్సహించాల్సి ఉందని ప్రముఖులు పిలుపు నిచ్చారు. భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు అనుచితం, దిగ్బ్రాంతికరం అని సూపర్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు.

మాల్దీవుల నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం ద్వారా తమ చెట్టుకొమ్మను తామే నరుక్కున్నారని, , భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్లుతుంటారనే విషయం తెలియదా? ఇంగితజ్ఞానం లేదా అని హీరోలు నిలదీశారు. తాను అనేక సార్లు మాల్దీవులను కొనియాడానని , ఇప్పుడు వారి విద్వేషంతో మునుపటి అభిప్రాయం మార్చుకోవల్సివస్తోందని స్పందించారు. ప్రముఖ నటుడు జాన్ అబ్రహం స్పందిస్తూ లక్షద్వీప్ ఆతిధ్యం, అక్కడి సముద్ర జీవజాలం రమణీయత తిరుగులేనిదని పేర్కొన్నారు. పైగా భారతదేశ అతిధిదేవోభవ తరహా మర్యాద లక్షద్వీప్‌లో ప్రతిఫలిస్తుందని , దీనిని ఎవరూ కాదనలేరని స్పందించారు. అందాలనటి శ్రద్ధాకపూర్ కూడా స్పందిస్తూ లక్షద్వీప్ అందాలను మరింతగా ఆస్వాదించాలని అనుకుంటున్నానని, ఇందుకు తాను అక్కడికి వెళ్లుతానని, అక్కడి తీర ప్రాంతాల రమణీయతను చాటి తీరుతానని స్పందించారు.

అక్కడి సంస్కృతి, ఆచార వ్యవహారాలు విస్తారిత తీర ప్రాంతం వేరే చోట చూడగలమా? వెంటనే తనకు అక్కడికి చుట్టి మీద వెళ్లాలని ఉందని, వెళ్లుతానని తెలిపారు. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కూడా లక్షద్వీప్ అందాలను కొనియాడారు. ప్రధాని మోడీ అక్కడికి వెళ్లి ఎంతో ప్రశాంత చిత్తంతో అక్కడి బీచ్‌ల ఆనందాన్ని ఆస్వాదించారని, ఇతరులకు సరైన సందేశం వెలువరించారని తెలిపారు. ఆయన పర్యాటక పిలుపుతో మనందరికి ఇప్పుడు లక్షద్వీప్‌మరింతగా సరికొత్తగా పరిచయం అయింది. యే హమారే ఇండియా మే హై అని తేటతెల్లం అయిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News