Friday, December 20, 2024

ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసిన సంఘటన రామంతపూర్‌లో చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేద్దామని చూశాడు. కానీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం…రామంతపూర్‌కు చెందిన సుగుణమ్మ భర్త మృతి చెందడంతో కుమారుడు అనిల్, కోడలు తిరుమలతో కలిసి ఉంటోంది. ఇల్లు సుగుణమ్మ పేరుపై ఉంది, దానిని విక్రయించాలని కుమారుడు, కోడలు గత కొంత కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పలుమార్లు సుగుణమ్మను ఇంటిని విక్రయించేందుకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయగా, దానికి సుగుణమ్మ నిరాకరించింది.

దీంతో సుగుణమ్మ బతికిఉన్నంత కాలం ఇంటిని విక్రయించడం సాధ్యం కాదని అనిల్, తిరుమల భావించారు. ఎలాగైనా తల్లి అడ్డుతొలగించుకుని ఇంటిని విక్రయించాలని ప్లాన్ వేశాడు. సుగుణమ్మను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం భార్య, స్నేహితుడికి చెప్పాడు. ముగ్గురు కలిసి సుగుణమ్మను హత్య చేశారు. తర్వాత తన తల్లి చనిపోయిందని ఏడుస్తూ అందరినీ నమ్మించేందుకు చూశాడు. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేయాలని చూశాడు. కానీ బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News