Friday, December 20, 2024

సోమవారం రాశి ఫలాలు(08-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుండి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్వల్ప మారులు వుంటాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు.

వృషభం –ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాదిస్తారు. ఋణవత్తిడుల నుండి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలుఅందుకుంటారు.

మిథునం –బంధువుర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి..

కర్కాటకం –మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. స్వల్ప ధన, వస్తులాభాలు.

సింహం –ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పట్టుదల పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి ధనలాభం.

కన్య –మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది. కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులకలయిక.

తుల –ముఖ్యమైన నిర్ణయాలు సొంత ఆలోచనలతో తీసుకుంటారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి.

వృశ్చికం –వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.

ధనుస్సు –కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం –ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు వుంటాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. స్వల్ప ధనలాభం.

కుంభం –వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సంతానం నుండి ధనలాభం.

మీనం –పట్టుదల పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News