- Advertisement -
తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని 18 జిల్లాల్లో ఆదివారం నుంచి వానలు కురుస్తున్నాయి. కాంచీపురం, దండిగల్, కోయంబత్తూరు, కాంచీపురం, తంజావూరు, కడలూరు, వెల్లూరు, చెంగల్ పట్టు, తిరువారూర్, కళ్లకురిచ్చి లో భారీ వర్షాలు కురిశాయి. నాగపట్నంలో ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.
దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షాలు పడుతుండడంతో ఆరు జిల్లాలో పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ఇటీవల కురిసిన కుండపోత వానలకు చెన్నై నగరాన్ని వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే.
- Advertisement -