సంక్రాంత్రికి అగ్ర హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున నటిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
విక్టరీ వెంకటేశ్ కుటుంబ కథా చిత్రాలు తీయడంతో నెంబర్ వన్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’ సినిమాలో వెంకటేశ్ నటిస్తున్నాడు. వెంకటేశ్‌కు ఇది 75వ చిత్రం కావడం గమనార్హం. సైంధవ సినిమా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. కూతురు సెంటిమెంట్‌తో కూడిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్ధీన్, ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కెతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు. మహేష్ బాబుకు జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో మహేష్ బాబుతో ఖలేజా, అతడు సినిమాలు తీయడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.
‘నా సామిరంగ’ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాగార్జునకు జంటగా ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ చిత్రంలో తేజా సజ్జా నటిస్తున్నారు. ఆంజనేయ స్వామి కథా నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. సామాన్యుడికి అసామన్య శక్తులు రావడంతో చెడుపై ఎలా విజయం సాధించడనేది కథా సారాంశం. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. శివకార్తికేయన్ నటించిన ‘అయలాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో శివకార్తికేయన్‌కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఆర్ వి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.