Monday, December 23, 2024

ఒక్క‌టి కాబోతున్న విజయ్ దేవరకొండ-రష్మిక..?

- Advertisement -
- Advertisement -

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ, నేషనల్ క్రష్ రష్మికా మందనలు త్వరలో పెళ్లి బందంతో ఒకటి కాబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న విజయ్, రష్మికా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. అంతేకాదు.. వీరి ఎంగేజ్ మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందట. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన మాత్రం రాలేదు. అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుందని, పర్ ఫెక్ట్ కపుల్స్ అని కామెంట్స్ చేస్తూ ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు.

కాగా, విజయ్, రష్మికల కాంబినేషన్ లో తెరకెక్కిన గీతాగోవింద్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో విజయ్, రష్మికల కమెస్ట్రీకి యూత్ బాగా కనెక్టయ్యారు. దీంతో ఈ మూవీ దాదాపు రూ.100 కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్స్ చిత్రంతో మరోసారి జతకట్టారు వీరిద్దరు. ఆ తర్వాత వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పటినుంచి  వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందని, డేటింగ్ కూడా చేస్తున్నట్లు ఎన్నో సార్లు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. వీరిద్దరూ మల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి.. విడివిడిగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లకు దొరికిపోయారు.

ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ సంబంధించిన ఫోటోలు రష్మిక షేర్ చేసింది. విజయ్ కూడా తన కుటుంబంతో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు పోస్ట్ చేశారు. ఇంకేముంది.. నెటిజన్లు ఆ ఫోటోలను పరిశీలించి వారిద్దరూ పోస్ట్ ఫోటోలో ఉన్న ప్లేస్ ఒక్కటేనని తేల్చేశారు. రష్మిక, విజయ్ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పేశారు. ఈ క్రమంలో దాగుడుమూతలు పులిస్టాప్ పెట్టి.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు వీరిద్దరూ సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News