న్యూయార్క్: విమానం ఆకాశంలో ఉన్నప్పుడు డోర్ ఊడిపోయింది. విడి భాగాలు పలు ప్రదేశాలలో పడ్డాయి, డోర్ ప్లగ్ పోర్టలాండ్‌లోని టీచర్ బాబ్ పెరట్లో పడింది. బారెన్స్ రోడ్ వద్ద ఫ్లైట్ డోర్ పడిపోయినట్టుగా గుర్తించారు. టీచర్ విమానయాన సంస్థకు మెయిల్ చేయడంతో సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. డోర్ ప్లగ్ బరువు 30 కిలోలు ఉంటుందని తెలిపారు. విమానంలో కాక్‌పీట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకొని విమానయాన అధికారులు పరిశీలించగా ఓవర్‌రైట్ అయినట్లు గుర్తించారు. సరైన సమయంలో ఆఫ్ చేయకపోవడంతో డేటా నిండిపోయిందని అధికారులు తెలిపారు.
విమానం నుంచి పడిపోయిన ఐఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌లో బ్యాటరీ సగం ఉందని, 16 వేల అడుగుల ఎత్తు నుంచి పడిన ఐఫోన్ పని చేస్తుండడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
అమెరికాలో శుక్రవారం ఓ విమానంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక డోర్ ఊడిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. అలాస్కా ఎయిర్ లైన్‌కు చెందిన విమానం 1282 పోర్ట్‌లాండ్ నుంచి ఒంటేరియాకు బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 16 వేల అడుగులకు చేరుకున్న విమానం డోర్ ఊడిపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ప్రయాణికులు బయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. డోర్ ఊడిపోగానే ప్రయాణికులు గాయపడ్డారు.