Wednesday, November 27, 2024

ఆ డబ్బులు వేయకుండా కాంగ్రెస్ మభ్యపెడుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించిందని, దళితబంధు అబ్ధిదారుల ఎంపిక పూర్తైన తరువాత దానిపై ఎందుకు స్పందించడంలేదని అడిగారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. పేదలు దళితులు, బిసిల ప్రయోజనాలను దెబ్బతీసేలా కుట్ర చేస్తే కొట్లాడుదామన్నారు. తాము ఎంత మంది రైతులకు డబ్బులు వేశామో ప్రజలకు వివరించే వాళ్లమని, రైతుబంధు డబ్బులు వేయకుండా కాంగ్రెస్ మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎండగట్టేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం వహిస్తుందని, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బిఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నిలక ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, ఓట్ల వారిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బిఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల కన్నా బిఆర్‌ఎస్ ముందు వరసలో ఉన్నా విషయాన్ని గుర్తు చేశారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో గెలుపోటములు కొత్త కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు హామీలపై మాట దాటవేస్తోందని, అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే డ్రామా ఆడుదతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News