Friday, December 20, 2024

శిథిలాల నుంచి 5 రోజుల తర్వాత బయటపడిన 90 ఏళ్ల వృద్ధురాలు

- Advertisement -
- Advertisement -

జపాన్ లో ఇటీవల సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 125మందికి పైగా మరణించారు. మరో 200మంది ఆచూకీ తెలియడం లేదు. శిథిలాల తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే భూకంపం తీవ్రతకు కూలిపోయిన ఒక ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా ఆ శిథిలాల కింద చిక్కుకున్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలు బయటపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ వృద్దురాలు ఐదు రోజుల తర్వాత కూడా ప్రాణాలతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News