- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కరించుకోవడం కోసం సమ్మెలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. 104, 108 అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సమ్మె చేస్తామని పిలుపునిచ్చారు. జనవరి 22లోగా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే పూర్తి స్థాయిలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ సిఇఒకు తమ సమ్మె నోటీసులను పంపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న స్పందన లేకపోవడంతో ఇవాళ నోటీసులు ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.
- Advertisement -