- Advertisement -
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ కెవై నాంజేగౌడ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. గౌడకు చెందిన మాలూర్, కోలార్ ఏరియాల్లోని కార్యాలయాలపై దాడులు చేశారు. కోలార్‌చిక్కబల్లాపూర్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న నాంజేగౌడ ఆ యూనియన్‌లో సిబ్బంది నియామకంలో అక్రమాలు జరిగాయని స్థానిక పోలీస్‌లకు అందిన ఫిర్యాదుల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. కోలార్ మిల్క్ కో ఆపరేటివ్ కార్యాలయం , ప్లాంట్ లో సోదాలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తి సంఘం కోలార్ జిల్లా కోఆపరేటివ్ సంస్థ. ఈ సొసైటీ పరిధిలో 11 రెవెన్యూ తాలూకాలు, 2919 గ్రామాలు ఉన్నాయి.
- Advertisement -