Monday, December 23, 2024

ఉత్తరాఖండ్‌లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్‌లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. 1981 నుంచి 40 ఏళ్ల కాలంలో వర్షపాతంలో చెప్పుకోతగిన తగ్గుదలన, ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చిందని , ఫలితంగా పంటల ఉత్పత్తిపై వ్యతిరేక ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరించారు. ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్‌లోని జిబి పంత్ యూనివర్శిటీ అగ్రికల్చర్, అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. కనీస ఉష్ణోగ్రత పెరుగుతుండగా, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు లేక పోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ విధమైన మార్పు పంటలు ముందుగానే పరిపక్వం చెంది దిగుబడులు అమాంతంగా తగ్గిపోడానికి దారి తీస్తుందని వివరించారు.

వాతావరణ విభాగానికి చెందిన మౌసమ్ జర్నల్‌లో ఈ అధ్యయనం గత వారం వెల్లడైంది. గత 40 ఏళ్లలో వర్షపాతం 58.621 మి.మీ వరకు క్షీణించగా, 1673 గంటల పాటు ఎండలు కాసాయి. 1.1 ఎం.ఎం వరకు ఆవిరికావడం జరిగింది. వాతావరణంలో ఈ విధమైన మార్పులు రాడానికి జనాభా పెరుగుదల, అర్బనైజేషన్, భూతాపం, కాలుష్యం పెరగడం, చివరకు మసకబారే ప్రభావాలు పెరిగి, మబ్బుపట్టే రోజులు ఎక్కువయ్యాయని పరిశోధకులు వివరించారు. ఎండకాసే రోజులు తగ్గడానికి, మబ్బులు పట్టే రోజులు పెరగడానికి సంబంధం ఉందని, కాలుష్యపెరగడంతో సూర్యుని రేడియేషన్‌ను గ్రహిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News