- Advertisement -
వారసత్వ ఆస్తి హక్కులో కర్నాటక హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుమార్తెలు చనిపోయినా.. వారి పిల్లలకు కూడా వారసత్వ ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలోని నారగుండాకు చెందిన చన్నబసప్ప హోస్మయి అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు కుమార్తెలకు సమాన వాటా నిరాకరిచడం రాజ్యాంగ సమానత్వ సూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
హిందూ వారసత్వ చట్టం 2005కు ముందు చనిపోయిన మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే.. అది, లింగ వివక్షతను శాశ్వతం చేస్తుందని, చట్ట సవరణల ద్వారా మహిళల హక్కులు హరించివేయలేరని హైకోర్టు పేర్కొంది.
- Advertisement -