Monday, December 23, 2024

ఎంఎల్ఎ పద్మావతిని తాడేపల్లికి పిలిచిన జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శింగనమల ఎంఎల్‌ఎ పద్మావతిపై సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాడేపల్లికి రావాలని సిఎంఒ నుంచి పద్మావతికి పిలుపు వచ్చింది. సిఎంఒ పిలుపు మేరకు ఎంఎల్‌ఎ పద్మావతి తాడేపల్లికి వచ్చారు. పద్మావతి సజ్జల రామకృష్ణారెడ్డితో సహా జగన్ మోహన్ రెడ్డిని కలువనున్నారు. శింగనమల సీటు నిరాకరణపై సిఎంఒపై పద్మావతి విమర్శలు గుప్పించారు. ఎస్‌సి నియోజకవర్గ ఎంఎల్‌ఎలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలపై జగన్‌కు వివరణ ఇచ్చేందుకు వచ్చానని పద్మావతి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపైనా జగన్ స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.
మాజీ మంత్రులు బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపి మాధవ్‌కు సిఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిఎం జగన్‌ను సదరు నేతలు కలువనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్ ను ఆ నేతలు చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News