Monday, December 23, 2024

దివ్యాంగుల కోసం త్వరలో 100 కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

అందుబాటు ధరలకు సహాయ పరికరాల అందచేత

గోవా: దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయక పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 100 కేంత్రాలను ఏర్పాటు చేయనున్నటుప్సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో 10 ఉండే ప్రధాన మంత్రి దివ్యశ కేంద్రాలు(పిఎండికె) ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 45 ఉన్నాయని, ఈ ఏడాది జూన్ నాటికి వీటి సంఖ్యను 100కి పెంచుతామని దివ్యాంగుల వ్యవహారాల శౠఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ఎఎల్‌ఎంసిఐ) అనుబంధంగా ఏర్పడిన పిఎండికె కృత్రిమ అవయవాల తయారీ, అమరికకు సంబంధించిన సేవలను అందచేస్తోంది.

ఈ కేంద్రాల ద్వారా లేక తాము నిర్వహించే శిబిరాల ద్వారా దివ్యాంగులు సహాయక పరికరాలను అందుబాటు ధరలకు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ కేంద్రాల ద్వారా తాము ప్రజలకు మరిన్ని ప్రత్యామ్నాయాలను అందచేస్తున్నామని, వారి అవసరాల మేరకు సహాయక పరికరాలను తయారుచేసి అందచేస్తున్నామని అగర్వాల్ వివరించారు. ఒకప్పుడు వీటి తయారీకి ఎక్కువ సమయం పట్టేదని, కాని అధిక కేంద్రాల ఏర్పాటు వల్ల వేచి ఉండే సమయం తగ్గిపోయిందని ఆయన చెప్పారు. కేంద్రాల పెంపు వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు. కృత్రిమ అవయవాలను తయరుచేసే ప్రొస్థెటిస్టుల సంఖ్యను పెంచడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఎఎల్‌ఐఎంసిలో ప్రస్తుతం 100కి పైగా ప్రొస్థెటిస్టులు ఉన్నారని, ఈ ఏడాది వీరి సంఖ్యను మరింత పెంచుతామని ఆయన చెప్పారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు మోటారు, మాన్యువల్ ట్రైసైకిళ్లు, వీల్ చెయిర్లు, స్మార్ట్‌ఫోన్లు, క్రచస్, డిజిటిల్, ప్రోగ్రామబుల్ హియరింగ్ ఎయిడ్లు, సుగమ్య కేన్, స్మార్ట్‌ఫోన్లు, సర్వైకల్ కాలర్లు, నీ బ్రేసెస్, కళ్లజోళ్లు వంటి సహాయక పరికరాలకు సంబంధించిన సేవలను ఎఎల్‌ఐఎంసిఓ అందచేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం వీటి తయారీ ఉత్పత్తి కేంద్రా భువనేశ్వర్, జబల్‌పూర్, బెంగళూరు, మొహాలి, ఉజ్జయిల్, ఫరీదాబాద్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News