Sunday, December 22, 2024

16% తగ్గిన వైట్‌కాల జాబ్స్

- Advertisement -
- Advertisement -

ఐటి, ఇతర రంగాల్లో మందగించిన నియామకాలు
పెరిగిన ఎఐ జాబ్స్ : నౌక్రీ.కామ్ నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో వైట్ కాలర్ నిమాయకాలు డిసెంబర్‌లో 16 శాతం తగ్గాయి. ఐటి, బిపిఒ, ఎడ్యుకే,న్, రిటైల్, హెల్త్ కేర్ సెక్టార్లలో నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గతేడాది(2022)తో పోలిస్తే 2023 డిసెంబర్ లో గణనీయంగా తగ్గుదలఉందని నివేదిక వెల్లడించింది. మరోవైపు ఆటోమేషన్ వల్ల ఐటి రంగంలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా వేగంగా తగ్గిపోతోందని నౌక్రీ.కామ్ నివేదిక వెల్లడించింది.

నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రకారం, 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 డిసెంబర్ నాటికి ఐటి రంగంలో నియామకాలు 21 శాతం తగ్గాయి. అయితే ఇదే కాలంలో ఎఐ సెక్టార్‌లో ఉద్యోగాలు పెరిగాయి. నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రకారం, ఐటి రంగంలో ఉద్యోగాల కొరత ఉన్నప్పటికీ ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు పెరిగాయి. మరోవైపు బిపిఓ, విద్య, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలలో కూడా జాబ్‌లు జాగ్రత్తగా రిక్రూట్ జరిగింది. ఈ రంగాల్లో ఉద్యోగాలు వరుసగా 17 శాతం, 11 శాతం, 11 శాతం, 10 శాతం తగ్గాయి.

హాస్పిటాలిటీ, ఫార్మాలో బూమ్
నివేదిక ప్రకారం, డిసెంబర్ 2023 నాటికి హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగాలు గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగాయి. 2023 నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉద్యోగాలు దాదాపు 2 శాతం పెరిగాయి. ఐటి యేతర రంగంలోని ఉద్యోగాల కారణంగా ఈ ఉద్యోగాల పెరుగుదల నమోదైంది. ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగింది.

దీంతో ప్లేస్‌మెంట్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. నాన్-మెట్రో నగరాలు ఉద్యోగాలు కల్పించడంలో మెట్రో నగరాలను వెనుకకు నెట్టాయి. గత నెలలో వడోదరలో కొత్త ఉద్యోగాల్లో 3 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఉద్యోగాలు పెరిగాయని నౌక్రీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వృద్ధిపై ఆశలు లేవు. అయితే 2022 డిసెంబర్‌తో పోలిస్తే హాస్పిటాలిటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య 4 శాతం పెరిగింది. ముంబై, ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లలో ఈ రంగంలో గరిష్ట ఉద్యోగాలు సృష్టి జరిగింది. హాస్పిటాలిటీ పరిశ్రమలో 16 ఏళ్లకు పైన అనుభవం ఉన్న వ్యక్తులకు డిమాండ్ వేగంగా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News