- Advertisement -
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.
కాగా, మంగళవారం శ్రీవారి 65,901 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 16,991 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -