- Advertisement -
హైదరాబాద్: భర్త మరణించిన 15 రోజుల తరువాత బాధతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధూల్‌పేటలోని ఆరాంఘర్ కాలనీకి చెందిన అస్మిత(31), అమన్‌కుమార్ సింగ్(36)ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు రోనక్, రిత్విక్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమన్ కుమార్ సింగ్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డిసెంబర్ 26న బిపి ఎక్కువ కావడంతో బ్రెయిన్ స్ట్రోక్‌తో దుర్మరణం చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత పదిహేను రోజుల నుంచి ఫొటో దగ్గర పెట్టుకొని అస్మిత మనస్తాపానికి లోనైంది. మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌కాలనీలో పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -