- Advertisement -
ఇస్లామాబాద్ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు జడ్జి సయ్యద్ మజహర్ అలీ అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు రోజు సుప్రీం కోర్టు క్రమశిక్షణ కమిటీ సయ్యద్ అనుచిత ప్రవర్తనపై విచారణను ఆపడానికి తిరస్కరించడంతో సయ్యద్ రాజీనామాకు దారి తీసింది. పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీకి రాసిన లేఖలో సయ్యద్ తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విధులను నిర్వహించలేనని వివరించారు. ఇదిలా ఉండగా మంగళవారం జస్టిస్ నక్వీ అనుచిత ప్రవర్తనపై కూడా సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కౌన్సిల్ విచారణ ప్రారంభించింది. ఈ విచారణను ఆపాలని జస్టిస్ నక్వీ అభ్యర్థించగా కౌన్సిల్ తిరస్కరించింది.
- Advertisement -