Tuesday, November 26, 2024

భారత తొలి మానవ రహిత విమానం ‘దృష్టి 10 స్టార్ లైనర్’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత తొలి మానవ రహిత(యుఎవి) విమానం ‘దృష్టి 10 స్టార్ లైనర్’ ను హైదరాబాద్‌లో ప్యారంభించారు. దేశీయంగా తయారు చేసిన ఈ యుఎవి విమానాన్ని హైదరాబాద్ తుక్కుగూడాలోని అదానీ ఏరోస్పేస్ సెంటర్‌లో భారత నావికా దళం కోసం తయారు చేశారు. ఈ మానవ రహిత విమానాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ బుధవారం ఆవిష్కరించారు. యుఎవి రంగంలో భారత దేశానికి ఇది కీలక ముందడుగు అని చెప్పవచ్చు. దీనికి ఇంటెలిజెన్స్, నిఘా (ఐఎస్‌ఆర్) సామర్ధ్యాలున్నాయి. ఈ విమానం గాల్లో 36 గంటలపాటు ఎగరగలదు. 450 కిలోల పేలోల పేలోడ్‌ను తీసుకెళుతుంది. స్టాంగ్ 4671 సర్టిఫికేషన్ రావడంతో అన్ని రకాల వాతావరణాల్లోనూ ఇది పనిచేయగలదు. ఈ సందర్భంగా అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ ‘సముద్రంపై ఆధిపత్యం, ఐఎస్‌ఆర్ సాంకేతికతలో ఆత్మనిర్భర్‌కు ఇది కీలక ముందడుగు అని అన్నారు.

అదానీ గ్రూపు ఈ రంగంలో తయారీపైనే కాకుండా, సామర్ధ్యాల అభివృద్ధిపై కూడా ఓ క్రమపద్దతిలో పని చేసిందని అన్నారు. దృష్టి 10ను నౌకాదళ కార్యకలాపాల్లో భాగస్వామిని చేయడంతో మా సామర్థ్యాలు మెరుగుపడనున్నాయన్నారు. సముద్ర గస్తీలో మా సంసిద్ధత బలోపేతం అవుతుందని, కేవలం 10 నెలల్లోనే ఈ యూఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్ నిబద్ధతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఐటి మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుఎవి ని ఆవిష్కరించడం గొప్ప విజయమని అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమని, పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని అన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతిక పరంగా ముందుందని పేర్కొన్నారు. .ఏరోస్పేస్ తయారీ, సర్వీసింగ్, ఇంజనీరింగ్, శిక్షణా సంస్థలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏరోస్పేస్, అనుబంధ పార్కులను కలిగి ఉందన్నారు.

భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ‘ అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ తమ రక్షణ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని తెలిపారు . 10 నెలల స్వల్ప వ్యవధిలో, వారు UAVల కోసం మొదటి కార్బన్ ఏరోస్ట్రక్చర్ల తయారీ లైన్‌ను స్థాపించారన్నారు. తెలంగాణ రాష్ర్టం భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏరోస్పేస్ కోసం ద్వైవార్షిక ఉత్తమ రాష్ట్ర అవార్డులను వరుసగా మూడుసార్లు (2018, 2020, 2022) గెలుచుకుందని తెలిపారు. 2016-2020 రెఫరెన్స్ పీరియడ్‌లో రాష్ట్రం ఈ రంగంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రక్ష రాజ్య మంత్రి, రక్షణ మంత్రిత్వ శాఖ,అజయ్ భట్, – చీఫ్ ఆఫ్ నెవెల్ స్టాఫ్, ఇండియన్ నేవీ, అడ్మిరల్ హరి కుమార్, డిజి ఏవియేషన్, ఇండియన్ ఆర్మీ అజయ్ కుమార్ సూరీ, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రెసిడెంట్ అండ్ సిఈఓ ఆశిష్ రాజ్‌వంశీ, అదాని ఎయిర్‌పోర్ ప్రమోటర్ అండ్ డైరెక్టర్ జీత్ అదానీ, ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News