Monday, December 23, 2024

కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలి: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ గతంలో చెప్పిందని, ఇప్పుడు అవినీతి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ అనడం సరికాదని, సిబిఐ విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పని తీరు బిఆర్‌ఎస్ నేతలు చేసి అవినీతిని కప్పిపుచ్చేలా వ్యవహరిస్తోందని బండి మండిపడ్డారు. తెలంగాణ యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారారని దుయ్యబట్టారు. పాఠశాలలో మత్తు పదార్థాల దందా జరుగుతోందని, డ్రగ్స్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు రాబడి వస్తుందని బండి ఆరోపణలు చేశారు. రామమందిర నిర్మాణం బిజెపి కార్యక్రమం కాదని, దీనిపై కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News