Saturday, November 23, 2024

‘వ్యూహం’ సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తయారైన ‘వ్యూహం’ సినిమా విడుదలపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో వాదోపవాదాలు ముగిశాయి. తీర్పును హైకోర్టు శుక్రవారం వెలువరిస్తుంది. ‘వ్యూహం’ సినిమాకు సిబిఎఫ్ సీ జారీ చేసిన సర్టిఫికెట్ ను నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ వ్యూహం నిర్మాత హైకోర్టులో కేసు వేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రభావం ఉంటుందని హైకోర్టు భావించిన పక్షంలో, తెలంగాణాలోనైనా సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఈ మూవీని రూపొందించారని ఆరోపిస్తూ, సినిమా ప్రదర్శనకు ఇచ్చిన సిబిఎఫ్ సీ ధ్రువీకరణను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News