Sunday, December 22, 2024

జిహెచ్ఎంసికి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు….

- Advertisement -
- Advertisement -

జిహెచ్ఎంసికి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు….
హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

హైదరాబాద్: లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైవ్ స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి గాను అందుకుంది. ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్ సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తో పాటు ఆడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సిబ్బందిని రవాణా & బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ సందర్భంగా నగరానికి క్లీన్ సిటీ అవార్డు రావడం పట్ల హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మరిన్ని అవార్డ్ లు అందుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News