Monday, December 23, 2024

పతంగుల పోటీల్లో విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

జాగ్రత్తలు చెబుతున్న విద్యుత్ అధికారులు

మనతెలంగాణ / హైదరాబాద్:  సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది ముగ్గుల పోటీలతో పాటు గాలి పటాల పోటీలు కూడా గుర్తుకు వస్తాయని ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని పండగను ప్రమాద రహితంగా జరుపుకోవాలని విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాలిపటాల పోటీల సందర్బంగా కొందరు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారని, ఈ ఉత్సావాలను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.విద్యుత్ స్తంభాలు, తీగలు వంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరకరాలు లేని ప్రాంతంలో పతంగులు ఎగురవేయాలని, అదే విధంగా విద్యుత్ స్తంభాలు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలను ఎగుర వేయకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ వైర్ల మీద పడిన గాలిపటాలను తీసుకునే ప్రయత్నం చేయవద్దని వాటి ద్వారా విద్యుత్ షాక్‌కు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. పతంగులను ఎగురవేసేందుకు మెటాలిక్ దారాలును వినియోగించ వద్దని వాటి ద్వారా విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. భవనాల మీద నుంచి గాని, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులును ఎగురవేసి ప్రయత్నం చేయవద్దని, వీటి ద్వారా విద్యుత్ తీగలు శరీరానికి తాకి షాక్ కలిగే అవకాశం ఉందన్నారు. పతంగులను ఎగురు వేస్తున్న సమయంలో పరిసర ప్రాంతాల్లో ఏమైనా హైటెన్‌షన్ తీగలు(హెచ్‌టి) ఉన్నాయా లేదా గమనించాలన్నారు.

చిన్నారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనేటుప్పుడు పెద్దలు తప్పకుండా వారికి సమీపంలోని ఉండి తగు జాగ్రత్తలు చెప్పాలని వారు సూచిస్తున్నారు. ఒక వేళ ఏదైనా ప్రమాదాలు సంభంచి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పడు వెంటనే 1912కు డయల్ చేయడం కాని లేదా సమీపంలో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించడం కాని చేయాలంటున్నారు. సాధ్యమైనంత వరకు గాలి పటాలు మైదానా ప్రాంతాల్లో ఎగురు వేయాలని , తద్వారా విద్యుత్ తీగలకు, దూరంగా ఉండి పండుగ వేడుకలు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పతంగులు ఎగుర చిన్నలు ,పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుని పండగను ఆనందంగా జరుపుకోవాలని వారు విజ్ఙప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News