Saturday, November 23, 2024

తొలి టి20లో టీమిండియా విజయం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టి20లో ఆతిథ్య టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 17.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్షఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ రెండో బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ గిల్ కూడా ఔటయ్యాడు.

ఐదు ఫోర్లతో వేగంగా 23 పరుగులు చేసిన గిల్‌ను ముజీబ్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తిలక్‌వర్మ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే 40 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు. జితేష్ శఱ్మ (31), రింకు సింగ్ 16 (నాటౌట్) అతనికి అండగా నిలిచారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ను నబి ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన నబి రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ఓపెనర్లు గుర్బాజ్ (23), ఇబ్రహీం (25) పరుగులు సాధించారు. అజ్ముతుల్లా (29) కూడా తనవంతు సహకారం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News