Saturday, November 23, 2024

కాళేశ్వరంపై మూడోరోజు విజిలెన్స్ సోదాలు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరానికి సంబంధించిన కీలక రికార్డులు స్వాధీనం… త్వరలో ప్రభుత్వానికి నివేదిక!

మనతెలంగాణ/హైదరాబాద్/మహదేవ్‌పూర్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం కూడా సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగుబాటు నేపధ్యలో వాస్తవాల నిగ్గుదేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపధ్యంలో మంగళవారం నుంచి ప్రా రంభమైన సోదాలు మూడవ రోజుకు చేరాయి. గోదావరి నదిపై రూ.4600కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ బృందాలు ప లు కోణాలనుంచి దర్యాప్తు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఏ విధానంలో పిలిచారు, ప్యాకేజీల వారీగా వాటి ప్రాధమిక అంచనాలు, కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వం కుదర్చుకున్న అగ్రిమెంట్లు, నిర్మాణ సమయం, పనుల్లో వాడిన స్టీల్, సిమెంట్, ఇతర కాంపొనెట్ల వివరాలు, వాటి నాణ్యత పరీక్షలు, ప్రధాన కాంట్రాక్టు సంస్థులు ఇతర సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు ఏవి, ఎక్కడెక్కడ వాటిని పూర్తి చేశారు.

క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా నిర్వహించిన నాణ్యత పరీక్షలు, వాటి రిపోర్టులు, బ్యారేజిల్లో నిలువ చేసిన నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ల నిర్మాణాలు, మోటార్ల విలువ, వాటి కెపాసిటి, పనితీరు, మోటార్ల కొనుగోలుకు చెల్లించిన ధరలు, బిల్లు చెల్లింపు ల రికార్డులు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో విధులు నిర్వహించిన ఈఎన్సీ మొదలుకుని కీలక స్థాయి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కడ సందేహం వచ్చినా ఆదే అంశాన్ని పదే పదే ప్రశ్నల రూపంలో సంధించి నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ కార్యాలయంతోపాటు రామగుండం నీటిపారుదల శాఖ కార్యాలయం, లోయర్ మానేరు ప్రాజెక్టు కార్యాలయం, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ ఇరిగేషన్ కార్యాలయం, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్ కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. వాటన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేసి ట్రక్కుల్లోకి ఎక్కించి విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. విజిలెన్స్ సో దాల అనంతరం సీజ్ చేసిన రికార్డులు, నీటిపారుదల శాఖ అధికారులతో వివిధ కోణాల నుంచి రాబట్టిన కీల క సమాచారం, ఇతర రిపోర్టులు అన్నింటిని సమగ్రంగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రమేష్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News