- Advertisement -
హైదరాబాద్: ఖమ్మం నగరంలో గ్రంథాలయం కుప్పకూలింది. విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ సెలవు కావడంతో గ్రంథాలయానికి విద్యార్థులు రాలేదు. గ్రంథాలయం కుప్పకూలడంతో ఇరుగుపొరుగువారు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా గ్రంథాలయంలోని వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని శిథిలాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -