Friday, December 20, 2024

విజయవాడ ద్రోహి చంద్రబాబు: కేశినేని నాని

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజయవాడ ద్రోహి అని నాని దుయ్యబట్టారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్న నాని.. శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని, ఆ పార్టీకి 54 సీట్లు వస్తాయని వివిధ సర్వేలు చెబుతున్నాయని నాని చెప్పారు. చంద్రబాబు కావాలనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారనీ, మరో 30 ఏళ్లు గడిచినా అమరావతి పూర్తి కాదని తాను ఎప్పుడో చెప్పానని  తెలిపారు. రాజధానికోసం భూములిచ్చిన రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు పొరబాటున గెలిస్తే మళ్లీ అమరావతి అంటారని, అప్పుడు విజయవాడతోపాటు ఇతర ప్రాంతాలు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. లోకేశ్ ను ముఖ్యమంత్రి చేయడమే చంద్రబాబు ఎజెండా అనీ, అందుకోసం పవన్ కల్యాణ్ ని కూడా మోసం చేస్తారని నాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News