- Advertisement -
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి దళితబంధు కూడా కొంత కారణమేనని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దళితబంధు ప్రయోజనాలు కొందరికే అందడంతో మిగిలినవారు వ్యతిరేకమయ్యారని ఆయన అన్నారు. అలాగే రైతు బంధు భూస్వాములకు ఇవ్వడాన్ని చిన్న రైతులు సహించలేకపోయారని చెప్పారు.
భువనగిరి ఎంపీ నియోజకవర్గంపై శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమికి ప్రజలను తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. పార్టీని రెండుసార్లు గెలిపించింది కూడా ఈ ప్రజలేననేది గుర్తుంచుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, 14 చోట్ల స్వల్ప మార్జిన్లతో ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు.
- Advertisement -