ఇంఫాల్ బదులు తౌబల్ జిల్లాలో యాత్ర ప్రారంభం: కాంగ్రెస్ ప్రకటన
ఇంఫాల్ : పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం (14న) రాఫ్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి బదులు తౌబల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ మైదానం నుంచి బయలుదేరుతుందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ఇంఫాల్‌లోని హప్తా కాంగ్‌జైబంగ్ మైదానం నుంచి యాత్ర ప్రారంభానికి అనుమతి కోరామని, కానీ కొన్ని షరతులో యాత్రకు రాఫ్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనితో చివరి క్షణంలో సుమారు 34 కిమీ దూరంలోని వేదికకు మారవలసి వచ్చిందని కాంగ్రెస్ మణిపూర్ శాఖ అధ్యక్షుడు కీషమ్ మేఘచంద్ర తెలిపారు.
‘భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించడానికి ఇంఫాల్‌లోని హప్తా కాంగ్‌జైబంగ్ బహిరంగ మైదానాన్ని అనుమతించాలని కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. యాత్ర ముంబయిలో మొదలై ముంబయిలో ముగుస్తుందని కూడా మేము ప్రకటించాం’ అని ఆయన తెలియజేశారు.