Friday, November 22, 2024

అయోధ్యలో డ్రోన్లతో భారీ కాపలా..

- Advertisement -
- Advertisement -

లక్నో : రామ మందిరం ప్రతిష్ఠాపన రోజు అయోధ్యలో మరింత భద్రత నిమిత్తం డ్రోన్లు, పది వేలకు పైగా సిసిటివి కెమెరాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు నియోగించనున్నారు. అయోధ్యలో రామ మందిరం పరిసరాలలో కనిపించే అనధికార డ్రోన్‌ను నియంత్రించడానికి డ్రోన్ నిరోధక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్‌పి (భద్రత) గౌరవ్ వన్‌స్వాల్ వెల్లడించారు. అయోధ్య జిల్లాలో పది వేలకు పైగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు,

దీనికి తోడు పోలీస్ బలగానికి దన్నుగా ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించనున్నట్లు డిజి (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఈ వ్యవస్థతో అనధికారిక డ్రోన్‌ను దేనినైనా నియంత్రించడం సులభం అవుతుందని ఆయన తెలిపారు. ఆలయానికి దారి తీసే రోడ్లలో అక్రమ ప్రవేశాలకు తావు లేకుండా చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 17న లేదా 18న భారీ వాహనాల మళ్లింపు ఉంటుందని, అందు కోసం ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సలహా పత్రాల జారీ ఉంటుంది డిజి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News