Monday, December 23, 2024

సంక్రాంతి పండగ సందర్భంగా బిఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలకు విరామం

- Advertisement -
- Advertisement -

17వ నుంచి యథావిధిగా సమావేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా బిఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలకు శనివారం(జనవరి 13) నుంచి ఈ నెల 16 వరకు పార్టీ విరామం ఇచ్చింది. మళ్లీ ఈ నెల 17వ తేదీ నుంచి యథావిధిగా సమావేశాలు కొనసాగుతాయి. అయితే 16న జరగాల్సిన నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశం ఈ నెల 22వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తం కావడంలో ఇందులో భాగంగా తెలంగాణ భవన్ వేదికగా ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 12 వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News