Saturday, December 21, 2024

వెయ్యి దాటిన కొవిడ్ జెఎన్ 1 కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 సబ్ వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యి దాటిందని భారతీయ సార్స్ కొవ్ 2 జినోమిక్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. కేసులు నమోదైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలోకి తాజాగ ఉత్తర ప్రదేశ్ చేరిందని ఇన్సాకాగ్ తెలియజేసింది. ఇన్సాకాగ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 214 కేసులతో కర్నాటక అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలలో ఆంధ్ర ప్రదేశ (189), మహారాష్ట్ర (170), కేరళ (154), తమిళనాడు (88), గుజరాత్ (76) నిలిచాయి.

తెలంగాణ, రాజస్థాన్‌లలో చెరి 2 జెఎన్ 1 కేసులు నమోదు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో 25, ఢిల్లీలో 16, ఉత్తర ప్రదేశ్‌లో ఏడు, హర్యానాలో ఐదు, ఒడిశాలో మూడు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒకటి వంతున కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటి వరకు జెఎన్ 1 కేసులు 1104 నమోదు అయ్యాయి. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం నిఘా వేసి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News