- Advertisement -
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. శనివారం ఈడీ.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది నాలుగోసారి. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు మాత్రం హాజరుకాలేదు.
ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ సారిమాత్రం రావాల్సిందేనని కేజ్రీవాల్‌కు సూచించింది. ఈనెల 18న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ పేర్కొంది. మరి ఇప్పుడు కూడా కేజ్రీవాల్.. విచారణకు హాజరవుతారా? లేదో? చూడాలి. రాజకీయ కక్షతోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ పేరుతో కేంద్రం వేధిస్తుందంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
- Advertisement -