Monday, December 23, 2024

‘గుంటూరు కారం’ ఆల్ టైమ్ రికార్డ్…

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు , శ్రీలీల , మీనాక్షి చౌదరి , రమ్య కృష్ణ , జయరాం , ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. గుంటూరు కారం సిన్మా ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. మహేశ్ కేరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే, కలెక్షన్లలో ఓ రీజనల్ సినిమా ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి. సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ పండుగ నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News