Monday, December 23, 2024

నార్త్ లోనూ ‘హనుమాన్’ హిట్ టాక్!

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి సందర్భంగా రిలీజైన హనుమాన్ మూవీ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, భారీ కలెక్షన్లు రాబడుతోంది. అన్నిచోట్లా పాజిటివ్ రివ్యూలను రాబడుతోంది. గ్రాఫిక్స్ లోనూ హనుమాన్ మూవీ ఇరగదీసిందనే టాక్ వినబడుతోంది. తొలి రోజే 21 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన హనుమాన్ ఉత్తర భారతంలోనూ ఒక ఊపు ఊపుతోంది. స్క్రీన్ పై  హనుమంతుడు కనిపించగానే ప్రేక్షకులు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు.

మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగలతో పోటీ పడుతున్న హనుమాన్ హిట్ టాక్ కంటిన్యూ అవుతోంది. ఈ మూవీ ఓటిటి రైట్స్ జీ5కు దక్కినట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో హనుమాన్ ఓటీటిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు కూడా బరిలో ఉండటంతో హనుమాన్ కు తగినన్ని థియేటర్లు దొరకలేదు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 26.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. తెలంగాణ మల్టీప్లెక్స్ లలో హనుమాన్ టికెట్ రేటు 295 రూపాయలు, హైదరాబాద్ లో సింగిల్ స్రీన్లపై 150 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే సింగిల్ స్క్రీన్ టికెట్ 110 రూపాయలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News