Monday, December 23, 2024

ప్రముఖ క్లాసికల్ సింగర్ ‘ప్రభా ఆత్రే’ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

మూడుసార్లు పద్మ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రీయ గాయని ప్రభా ఆత్రే (92) కన్నుమూశారు. పుణెలోని తన నివాసంలో అస్వస్థకు గురైన ఆమెను దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పూణేలో అబాసాహెబ్, ఇందిరాబాయి అత్రే దంపతులకు సెప్టెంబరు 13, 1932న ఆమె జన్మించారు. శాస్త్రీయ గాయకురాలుగానే కాకుండా, ఆమె విద్యావేత్తగా, పరిశోధకురాలిగా, స్వరకర్తగా రచయిత్రిగా కూడా రాణించారు. సైన్స్, లా గ్రాడ్యుయేట్ అయిన ఆమె సంగీతంలో డాక్టరేట్ పొందారు.

ప్రభా ఆత్రే ఎన్నో దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె సేవలకు గానూ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు దక్కింది. 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషన్, 2022లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఆత్రే సన్నిహిత కుటుంబ సభ్యులు కొందరు విదేశాల్లో నివసిస్తున్నందున, వారు వచ్చిన తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రభా ఆత్రే మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News