Saturday, November 23, 2024

రామమందిర ప్రతిష్ఠ రాష్ట్రపతి నిర్వహించాలి: ఉద్ధవ్ థాక్రే డిమాండ్

- Advertisement -
- Advertisement -

ముంబై : అయోధ్యలో రామమందిరం నిర్మాణం తన తండ్రి బాలా సాహెబ్ థాక్రే కల అని, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న తన తండ్రి బాలాసాహెబ్ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ కార్యక్రమం దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జరిగిందని, ఇక అయోధ్య రామ మందిరం జాతీయ గర్వకారణమే కాక, దేశ ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి రాష్ట్రపతి ముర్ము నిర్వహించాలన్నారు. విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపన గురించి శంకరాచార్యులతో చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

జనవరి 22 న తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నాసిక్ లోని చారిత్రక కాలారం ఆలయాన్ని సందర్శిస్తామని, అక్కడ గోదావరి ఒడ్డున మహా హారతి నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 1992 నాటి కరసేవలో పాల్గొన్న శివసైనికులను సత్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News