Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి వారణాసి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం శనివారం ఒంటి గంటలకు వారణాసికి బయలుదేరాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుందని స్పైస్‌జెట్ సిబ్బంది ప్రయాణికులకు ప్రకటించారు. కానీ, సమయం 5 గంటలు దాటినా విమానం రాకపోవడంతో మళ్లీ ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించగా సర్వీసును పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టు లాబీల్లో నిరసనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా విమానాలు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News