Monday, December 23, 2024

బీచ్‌లో సాహిత్యపు అలల హోరు

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ : కేరళలోని కోజికోడ్ తీరపు బీచ్‌లో ఈ నెల 11న ఆరంభమయి 14వ తేదీ వరకూ సాగే కేరళ సాహిత్య ఉత్సవాలు (కెఎల్‌ఎఫ్) ఈసారి అత్యంత ప్రాధాన్యతను, ప్రత్యేకతను సంతరించుకుంది. సాహితీ అభిమానులకు వేదికగా పండుగగా సాగే ఈ ఉత్సవంలో మొత్తం మీద ఐదులక్షల మందికి పైగా పాల్గొంటారు, ఎందరో సాహితీవేత్తలు హాజరయి, సెమినార్‌లలో పాల్గొంటారు. చుట్టూ కన్పించే అపార సముద్ర తీరం వెంబడి ఆలోచనల వేదికగా దీనికి పేరొచ్చింది.

సువిశాల ఆవరణలో ఎటువంటి బారికేడ్లు ప్రతిబంధకాలు లేని ప్రాంతంలో ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నేహితులను పుస్తకాలను సముద్ర తీర అందాలను ఆస్వాదించవచ్చునని, పనిలో పనిగా విశిష్ట వంటకాల రుచి చూడవచ్చునని ఇక్కడికి వచ్చిన కన్నూర్‌వాసి 28 సంవత్సరాల ఫైజల్ సలీం చెప్పారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగినా తాను వెళ్లుతుంటానని, ఈసారి ఇదితనకు మరీ ప్రత్యేకం అన్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News