Monday, November 18, 2024

కులగణనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

- Advertisement -
- Advertisement -

ఓబిసి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ
రాహుల్ న్యాయయాత్రకు అండగా నిలుస్తాం : ఓబిసి నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాతి జనగణలో బిసిల కులగణన చేర్చి దేశవ్యాప్తంగా బిసి కులాల లెక్కలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామినిచ్చారు. ఓబిసి కులగణనే బిసిల అన్ని సమస్యలకు పరిష్కారమని, బిసి జనాభా దామాషా కనుగుణంగా బిసిల వాటా దక్కడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రాహుల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలకు చెందిన ఓబిసి సంఘాల ప్రతినిధులు శనివారం జాతీయ బిసి కమిషన్ మాజీ చైర్మన్ అఖిలభారత బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో న్యూఢిల్లీలోని జనపదలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

దేశవ్యాప్తంగా ఓబిసిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాహుల్ గాంధీ ఓబిసి ప్రతినిధులతో సుమారు గంటసేపు చర్చించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఓబిసి ప్రతినిధులు ఈ సందర్భంగా తమ సమస్యలపై మాట్లాడగా రాహుల్ గాంధీ ఆసక్తిగా ఆలకించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీతో జస్టిస్ ఈశ్వరయ్య బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు కలిసి మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా ఓబిసి కులగణన నిర్వహించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిసిలను నిర్లక్ష్యం చేసిందని, బిసి రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచకుండా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, బిసిలపై క్రిమిలేయరు విధిస్తూ అన్యాయం చేసిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల నాగపూర్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఓబిసి కులగణనను నిర్వహించి ఓబిసిలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటాను కల్పిస్తామని ప్రకటించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటకల్పించడంపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి బిసిలు అండగా నిలబడాల్సిన సామాజిక నైతిక బాధ్యత బిసిలపై ఉందని వారన్నారు రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జూడో న్యాయ యాత్ర కు బిసిలందరూ మద్దతుగా నిలబడతామని అదే సమయంలో ఇండియా కూటమికి కూడా తాము అన్ని విధాల మద్దతు గా ఉంటామని రాహుల్ గాంధీకి తెలిపారు. ఓబిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుని మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కోరినట్లు జాజుల తెలిపారు. రాహుల్ గాంధీని కలిసిన వారిలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ చంద్రశేఖర్, బెల్లయినాయక్, గొమాస శ్రీనివాస్, డాక్టర్ రవి, జనగాం రవీందర్ గౌడ్, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Congress fully supports caste census

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News