న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా నిరోధించడానికి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ స్టేజీ థర్డ్‌లో స్టోన్ క్రషర్స్ మూసివేయడం, మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు, నిర్మాణాలు , కూల్చివేతలపై కఠినమైన పరిమితులున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుధ్ధ నగర్ జిల్లాల్లో బీఎస్ 3 పెట్రోల్, బీఎస్4 స్జేట్ వాహనాలపై ఆంక్షలుంటాయి.
ఎన్‌సిఆర్ పరిధి లోని రాష్ట్రాలు ఐదో తరగతి వరకు పిల్లలకు పాఠశాలల్లో తరగతులు నిలిపివేసి, ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి దారుణంగా ఉంది. అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్’ కేటగిరికి చేరింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూ 478 కి చేరింది. నెహ్రూ స్టేడియం, ఐజీఐ విమానాశ్రయం, ఐటీఓ ల్లో వాయునాణ్యత 465455 మధ్య కొనసాగుతోంది.