లంగర్‌హౌస్, అల్వాల్‌లో ఇద్దరి మృతి
చైనా మాంజాకు సైనికుడి బలి
మనతెలంగాణ, సిటిబ్యూరోః పతంగుల సరద పలువురి ప్రాణాలు తీస్తున్నాయ. నగరంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఎపిలోని విశాఖపట్టణం, పెద్దవాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి(30) ఆర్మీలో నాయక్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి లంగర్‌హౌస్‌లో ఉంటున్నాడు. ఈ నెల 13వ తేదీన విధులు ముగించుకుని రాత్రి 7.25 గంటలకు లంగర్‌హౌస్‌లోని ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ మీదుగా బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా కోటేశ్వర్‌రెడ్డి మెడకు చుట్టుకుంది.
మెడ కట్‌కావడంతో ఫ్లైఓవర్‌పై పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లంగర్‌హౌస్ పోలీసులు 304 ఐపిఎస్ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అల్వాల్‌లో పతంగి ఎగురవేస్తు ఓ యువకుడు మృతిచెందాడు.
అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ కుమారుడు ఆకాష్(20) సంక్రాంతి పండగ కావడంతో బిల్డింగ్‌పై పతంగి ఎగుర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై ఉంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పండుగ రోజు పతంగులకు ఇద్దరు మృతిచెందడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో ముగినిపోయాయి.