- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 375 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 3075కు తగ్గాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో ఇద్దరు కరోనాతో చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్నవారు 4.4 కోట్ల మంది కన్నా ఎక్కువగా ఉండగా, రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. దేశంలో ఇంతవరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. డిసెంబర్ 5 వరకు రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించినా, ఆ తరువాత నుంచి కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తితోపాటు శీతల వాతావరణ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. డిసెంబర్ 31న ఒక్కరోజులోనే 841 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.
- Advertisement -