Sunday, November 24, 2024

భారత్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు జైశ్వాల్(68), శివం దూబే(63) భారీ అర్ధ సెంచరీలతో చెలరేగారు. 172 పరుగుల విజయ లక్షాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. దీంతో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 20తో కైవసం చేసుకుంది. 172 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన టీమిండియా అదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరగగా అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(29) యశస్వి జైశ్వాల్‌తో కలిసి స్కోరు బోర్డును చక్కదిద్దె పనిలో పడ్డాడు.

ఈ క్రమంలో నవీనుల్ హాక్ వేసిన ఓవర్‌లో ఇబ్రహీం జాడ్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దూబే ప్రారంభం నుంచే దూకుడు పెంచి జైశ్వాల్‌తో కలిసి భారత స్కోర్ బోర్డు 150 పరుగులకు దాటించాడు. ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వీరిద్దరూ మరింత జోరు ఆడే క్రమంలో జైశ్వాల్‌ను కరీం జనత్ ఔట్ చేయగా ఆవెంటనే క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మను సయితం జనత్ పెవిలియన్ పంపాడు. అనంతరం రింకూ సింగ్(9)తో కలిసి దూబే భారత విజయాన్ని లాంఛనం చేశాడు. ఇక అఫ్ఘన్ బౌలర్లలో కరీం జనత్ రెండు వికెట్లు కూల్చగా, ఫారూఖీ, నవీనుల్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది.ఓ బౌండరీ, సిక్సర్‌తో జోరు పెంచిన రెహ్మానుల్లా గుర్బాజ్(14)ను రవి బిష్ణోయ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన గుల్బాదిన్ నైబ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్లతో పాటు బౌండరీలు మోత మోగించడంతో అఫ్గాన్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను ధాటింది. అయితే మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్(8)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి పవర్ ప్లేలో అఫ్గాన్ 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. ఆ వెంటనే అజ్మతుల్లా ఒమర్జాయ్(2)ను శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీతో

కలిసి గుల్బాదిన్ నైబ్(35 బంతుల్లో 5×4, 4×6 57) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే మహమ్మద్ నబీ(14)ని రవి బిష్ణోయ్ ఔట్ చేయ గా.. నజిబుల్లా జడ్రాన్(23) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్ చేయగా.. కరీమ్ జనత్(20) శివమ్ దూబే వేసిన 19వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 172 పరగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32), రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News